TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'మనం' అక్కినేని చూడలేకపోవడం బాధాకర౦: వర్మ

Published on: Sat May 24, 2014 11:59AM

 

 

 

ట్విట్టర్ లో కాంట్రవర్సీ కామెంట్ లతో వార్తలలో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా 'మనం' మూవీపై ప్రశంసల వర్షం కురిపించాడు. బాలీవుడ్ లో ఈ చిత్రం విడుదలై ఉంటే సులభంగా వంద కోట్ల రూపాయలు వసూలు చేసేదని అన్నారు. నాగేశ్వరరావు గారితో తొలిసారిగా నాగార్జున నటించేటప్పడు తడబాటుకు గురయ్యాడు. అయితే నాగ చైతన్య విషయంలో అలాంటిది జరగలేదని. నాగార్జున కంటే నాగచైతన్యనే బెటర్ గా యాక్ట్ చేశారని వర్మ ట్వీట్ చేశారు. మనం చిత్రాన్ని ఎన్నార్ చూడలేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు నటించిన 'మనం' సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.