Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వందేభారత్ రైళ్లలో 15 నిముషాల ముందు కూడా రిజర్వేషన్
posted on: Jul 19, 2025 4:12PM

వందే భారత్ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుపుతున్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆ క్రమంలో వందే భారత్ రైలు బయల్దేరే పావుగంట ముందు కూడా రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.
ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా రైలు బయల్దేరే 15 నిమిషాలకు ముందు ఖాళీ సీట్ల వివరాలు తెలుపుతామని, ఆ సీట్లు ప్రయాణికు లు రిజర్వేషన్ చేసుకోవచ్చను ఈ సౌకర్యం మంగళూరు సెంట్రల్-తిరువనంతపురం (నెం.20631), తిరువనంతపురం-మంగళూరుసెంట్రల్(నెం.20632), చెన్నై - ఎగ్మూర్- నాగర్‌కోయిల్(నెం.20627), నాగర్‌కోయిల్-చెన్నై ఎగ్మూర్ (నెం.20628), కోయంబత్తూర్-బెంగళూరు కంటోన్మెంట్ (నెం.20642), చెన్నై సెంట్రల్-విజయవాడ , మంగళూరు సెంట్రల్-మడగావ్ (నెం.20646), మదురై-బెంగళూరు కంటోన్మెంట్ (నెం.20671) తదితర 8 వందే భారత్ రైళ్లకు కల్పించినట్లు అధికారులు తెలిపారు.






