Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు
posted on: May 29, 2025 8:50PM

వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే ఆయనకు వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. తన హెల్త్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వంశీకి తక్షణమే వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది.
కాగా అక్రమ మైనింగ్ కేసులో కూడా వంశీకి నేడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్ట్. అదే విధంగా వంశీ తనకు మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రి లో సరైన సౌకర్యాలు లేవని కోర్టుకు నివేదించారు. దీంతో, వంశీకి మెరుగైన చికిత్స అందించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


.webp)



