అతడే నిజమైన నాయకుడు.. వీహెచ్
posted on Aug 24, 2015 1:22PM

భూసేకరణ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ లో ట్వీట్లు పోస్టు చేసిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఆ ట్వీట్లపై.. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన సంగతి తెలిసిందే.. ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేస్తే ఏం వస్తుంది.. రైతుల దగ్గరకు వెళ్లాలి వారి సమస్యలను తెలుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు వీహెచ్ పవన్ కళ్యాణ్ ను ప్రశసించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం భూసేకరణపై రైతులకు నోటీఫికేషన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయనే స్వయంగా రాజధాని ని పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకొని ఏపీ ప్రభుత్వపై పోరాటానికి దిగారు. ఈ నేపథ్యంలో వీహెచ్ స్పందిస్తూ రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములను బలవంతంగా లాక్కోరాదని డిమాండ్ చేస్తూ పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లడం.. వారి సమస్యలను పవన్ తెలుసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాదు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని అవసరమే కాని దానికి రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదని అన్నారు. ప్రజల ఇబ్బందులపై స్పందించేవాడే నిజమైన నాయకుడు అని మా పార్టీ నేతలు చేయలేని పనిని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని ప్రశంసలు కురిపించారు.