తిరుమలలో విహెచ్ కి సమైక్య సెగ

posted on: Aug 17, 2013 8:36PM

 

v hanumantha rao, v hanumantha rao telangana, telangana v hanumantha rao

 

 

ఎట్టకేలకు భారీ భద్రత మధ్య తిరుమల కొండపైకి దిగిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుకు సమైక్య సెగ తగిలింది. విహెచ్ వాహనాన్ని సమైక్యవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని నెట్టేసేందుకు ప్రయత్నించారు. స్వల్పంగా లాఠీచార్జీ కూడా చేశారు. సమైక్యవాదుల్లో ఒకరి నుంచి విహెచ్ గులాబీ పూవు తీసుకున్నారు. తాము ఆందోళన చేయబోమని గులాబీ పూలు అందిస్తామని చెప్పడంతో పోలీసులు ఐదుగురికి అనుమతించారు. అయితే, అలిపిరి వద్ద విహెచ్ వాహనాన్ని వారు అడ్డుకున్నారు. అది ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు వి.హనుమంతరావును అక్కడి నుంచి సురక్షితంగా ముందుకు తీసుకుని వెళ్లారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...