Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బొత్స దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి
posted on: Jul 19, 2013 2:49PM

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చాలా తెలుసునని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత్‌రావు పేర్కొన్నారు. బొత్స ప్రస్తుతం ఒక్క బాణం మాత్రమే వదిలారని, ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నారు. వైఎస్ కష్టంతో ప్రభుత్వం ఏర్పడిందనడం సరికాదని అన్నారు. అలాగైతే 2009లో 156 సీట్లే ఎందుకు వచ్చాయని వీహెచ్ ప్రశ్నించారు.
తన అన్న పులి బోనులో ఉన్నాడని, బయటకు వస్తారని, రామరాజ్యం తెస్తారని షర్మిల ప్రచారం చేస్తున్నారు. ప్రజలను చంపుకు తినే పులి జైలులోనే ఉంటే మంచిదని వీహెచ్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకు వస్తే రాష్ట్రాన్ని దోచేస్తాడని వీహెచ్ అన్నారు. ఏమీ లేనప్పుడే రాష్ట్రాన్ని దోచుకున్నాడు, ఇప్పుడు బయటకు వస్తే అందరినీ తినేస్తాడని వీహెచ్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకు వస్తే రామరాజ్యం అయితే తాను చూడలేనని, ఏం జరుగుతుందో మాత్రం రాష్ట్ర ప్రజలకు తెలుసునని హనుమంతరావు పేర్కొన్నారు.


.jpg)
.jpg)


