కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి ప్రియాంక..

posted on: Oct 26, 2011 11:24AM

న్యూ ఢిల్లీ : వచ్చే యేడాది ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ వర్గాలు ఒక ప్రణాళికను రూపొందించినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం చేసినప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకునిరాలేక పోయారు. ఈ దఫా మాత్రం దేశానికి గుండెకాయలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.ఇందుకోసం వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ ని రంగంలోకి దించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

చిరకాలంగా ఉత్తరప్రదేశ్‌లో అధికారానికి దూరంగా ఉంటున్న కాంగ్రెస్,ఈ ఎన్నికల్లో కనీసం కొన్ని స్థానాల్లోనైనా పట్టు సాధించేందుకు ప్రియాంకను రంగంలోకి దించాలన్న తపనతో ఉన్నాయి.ఇదివరకు జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రియాంక అప్పట్లో కేవలం రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు. రాహుల్ గాంధీ ప్రధాన ప్రచారకర్తగా కొనసాగుతారని, అయితే పలుచోట్ల ప్రియాంక కూడా ప్రచారం చేపట్టాలని కార్యకర్తలు కోరుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...