ఈ ఐదు అలవాట్లకి దూరంగా ఉండండి

మీరు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారా? అయితే మీ అనారోగ్యానికి ఈ అలవాట్లు కారణం అయి ఉండొచ్చు. సాధారణంగా, టాయిలెట్ బౌల్ మరియు మన ఇంటి ఫ్లోర్ అత్యంత మురికైన ప్రదేశాలుగా భావిస్తుంటారు. కానీ, అంత కన్నా అపరిశుభ్రమైన విషయాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఈ ఐదు అలవాట్లకు దూరంగా ఉండండి.

 

1 . బాత్రూం లో ఫోన్ వాడడం
కొందరికి బాత్రూం లో ఫోన్ వాడడం అలవాటు ఉంటుంది. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందనే విషయం మీకు తెలుసా?  టాయిలెట్ సీట్లు, హ్యాండిల్స్, సింక్ మరియు కుళాయిలపై హానికరమయిన జెర్మ్స్ ఉంటాయి. వీటివల్ల మూత్రసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున, టాయిలెట్ లో మధ్య మధ్యలో ఫోన్ వాడడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

2 . హ్యాండ్ బ్యాగ్ తొలగించకపోవడం
హ్యాండ్ బ్యాగ్ లు మరియు పర్సులు నిరంతరం మన చేతుల్లోనే ఉంటాయి. సాధారణ సమయంలో వాటిని ఉపయోగించడం వల్ల పెద్ద నష్టం ఏం ఉండదు. కానీ, బాత్ రూమ్ కి వాటిని మనకి తోడుగా తీసుకెళితే మాత్రం ఇబ్బందే. టాయిలెట్ కి వెళ్ళినపుడు ముందుగా హ్యాండ్ బ్యాగ్ ని అక్కడ ఉండే హుక్ కి తగిలించి వెళ్లడం బెటర్. తర్వాత బ్యాగ్ ని పై నుండి మరియు లోపల యాంటీ బాక్టీరియా క్లాత్‌తో తుడిచివేయడం మంచిది. తద్వారా హాని కలిగించే క్రిముల బారిన పడకుండా ఉండవచ్చు.

 

3 . షూస్ ఎక్కువ సేపు ధరించడం
ఒక రీసెర్చ్ ప్రకారం దాదాపు 40 % షూస్ డయేరియా కలిగించే బ్యాక్టీరియా కలిగి ఉంటాయి. కాబట్టి ఆఫీస్ కి గానీ ఎక్కడికయినా వెళ్ళినపుడు మీ బూట్లు బయటే వదిలేసి వెళ్లడం మంచిది. అదే ప్రయాణంలో అయితే, ఒక శుభ్రమయిన సంచిలో తీసుకెళ్లడం బెటర్.

 

4 . రిమోట్ ని శుభ్రపరచకపోవడం
మనం టీవీ రిమోట్ ని ఎక్కడ పడితే అక్కడ పడవేస్తాం. అయితే, రిమోట్ ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం వల్ల హానికారక బ్యాక్టీరియా నుండి ఉపశమనం పొందవచ్చు.

 

5 . స్పాంజిని సరిగ్గా పిండకపోవడం
స్పాంజీలని వాస్తవానికి మనం ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటాం. అయితే అదే స్పాంజీలు మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. కాబట్టి, స్పాంజీలని నెలకి ఒకసారి మార్చడమో లేదా వేడి నీటిలో ఉంచి పిండటమో చేస్తే క్రిముల బారి నుండి మనల్ని మనం రక్షించుకున్నవాళ్లమవుతాం.