యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల

posted on: Mar 6, 2026 3:49PM

 

దేశంలో అత్యున్నతమైన సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ  విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అనూజ్‌ అగ్నిహోత్రి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్‌ సాధించారు. రాజేశ్వరి సువే రెండో స్థానంలో నిలిచారు. ఆకాన్ష్‌ ధుల్‌ మూడో ర్యాంక్‌ పొందారు. రాఘవ్‌ ఝున్‌ఝున్‌ వాలా నాలుగో ర్యాంక్‌ సాధించారు.  ఈ పరీక్షల్లో తెలుగు తేజాలు సత్తా చాటారు. ఈ ఏడాది మొత్తం 958 మంది అభ్యర్థులను యూపీఎస్‌సీ వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేసింది.

తెలుగు విద్యార్థులు  సృజన (55వ ర్యాంక్‌), డీఎస్‌కే ప్రచేత్‌ (193వ ర్యాంక్‌), ఎస్. వర్షిత్‌రెడ్డి (259వ ర్యాంక్‌), ఎం.పవన్‌కుమార్‌రెడ్డి (297వ ర్యాంక్), వి. విక్రమసింహారెడ్డి (541వ ర్యాంక్‌), గుమ్మల శ్వేత (573వ ర్యాంక్‌), పోతుపురెడ్డి భార్గవ్‌ (537వ ర్యాంక్‌), పుడారి రాహుల్‌ (748వ ర్యాంక్‌), కత్తిమాని అనిరుధ్‌ (786వ ర్యాంక్‌), కోరపాతుల శ్రీకర్‌రాజు (806వ ర్యాంక్‌), ఇస్లావత్‌ శ్రీరామ్‌ హర్ష (823 ర్యాంక్), కట్టా ప్రత్యూష (908వ ర్యాంక్‌), గోగుల రాజశేఖర్‌ (920వ ర్యాంక్), గుగులోతు జితేందర్‌ నాయక్‌ (939వ ర్యాంక్) సాధించారు. 

2025లో ప్రిలిమ్స్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జమ్‌లో క్వాలీపై వారికి ఆగస్ట్, సెప్టెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు చేపట్టారు. వాటిలో అర్హత పొందిన వారికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ చివరి వడపోతలో మొత్తం 1087 మంది అభ్యర్థులు సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. కఠినమైన శ్రమ, పట్టుదలతో విజయం సాధించిన విజేతలకు పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...