Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెసేతర ప్రభుత్వాలపై యూపీఏ వివక్ష.. అద్వానీ
posted on: Oct 25, 2011 2:51PM
న్యూ
ఢిల్లీ: దేశంలోని కాంగ్రెసేతర ప్రభుత్వాలపై కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వివక్ష ధోరణిని ప్రదర్శిస్తోందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే నేతలపైనా, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే ప్రభుత్వాలపైనా సీబీఐను ఒక ఆయుధంగా వినియోగించుకుంటుందోనిఆయన ధ్వజమెత్తారు.అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన జన చేతన రథయాత్రలో ఆయన ప్రసంగింస్తూ ప్రధాని కళ్ల ముందే అవినీతి జరుగుతున్నా పట్టించుకోవటం లేదన్నారు. ఇటీవల ముగిసిన ఎన్డీసీ సమావేశంలో కేంద్రం అనుసరిస్తున్న వివక్షను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టిందని అద్వానీ గుర్తు చేశారు.అలాగే, నదీ జలాల పంపిణీ అంశంపై బంగ్లాదేశ్‌తో యూపీఏ కుదుర్చుకున్న ఒప్పందం గురించి తమకు మాటమాత్రంగా కూడ కేంద్రం చెప్పలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారని ఆయన గుర్తు చేశారు. అలాగే, అనేక కాంగ్రస్సేతర రాష్ట్ర ప్రభుత్వాలకు అభివృద్ధి నిధులను విడుదల చేయడంలోనూ వివిక్షను చూపిస్తోందని అద్వానీ విమర్శించారు.



.jpeg)


