Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీని బంగాళాఖాతంలో కలిపేద్దాం.. చంద్ర నిప్పులు
posted on: Oct 19, 2022 5:21PM
జగన్ భయపడి 2024లో గాని, ముందు ఎన్నికలు జరిపినా, వైసిపిని ప్రజలను భూస్థాపితం చేస్తా రు, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులకు ఉరితాళ్లు వేస్తున్నాడు. తెలంగాణ మీటర్లు పెట్టడం లేదు. ఎక్కడా లేని ఈ అతితెలివి నీకే ఎందుకు వచ్చింది జగన్, ఈ అతి తెలివి పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నాలుగేళ్లుగా రాష్ట్రం లో ఒక్కరికి ఉద్యోగం రాలేదు. నా జీవితంలో దాపరికం లేదు, అందుకే అన్ స్టాపబుల్ లో అన్ని వివరిం చాను, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేవరకు విశ్రమించనన్నారు. జగన్ పాలనలో బిసిలు, ఎస్సిలు, ముస్లింలు సహా అందరూ దెబ్బతిన్నారు. ప్రజల అప్పులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు అప్పులు పెంచే ప్రభుత్వం మనకు అవసరమా రాష్ట్రాన్ని కాపాడుకుందాం...అందరూ సహక రించాలని కోరుతున్నా నన్నారు.
అసత్యాలు చెప్పడంలో జగన్ దిట్ట, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఆయనకు లేనే లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల గ్రామంలో ప్రతిపంట రైతులను బాబు కలిసి వారి కష్టాలు విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ వర్షాలకు ప్రత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. పల్నాడు జిల్లాలో2.52 లక్షల ఎకరాల్లో ప్రత్తి, 1.50 లక్షల ఎకరాల్లో మిరప పంటల సాగు ఉంది. మిరప, ప్రత్తి పంటలకు ఇప్పటికే ఎకరా నికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు.తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ముఖ్యమంత్రికి ఈ పంట నష్టం పట్టడం లేదా అన్నారు. రైతాంగానికి అంత ఇచ్చాం,ఇంత ఇచ్చాం అంటూ ప్రచారం చేసుకోవడమే తప్ప వాస్తవానికి రైతులను ఆదుకోవడానికి జగన్ ఏమీ చేయలేద న్నారు. రైతులకు ఇంత నష్టం జరిగితే అధికారులుగాని, ఎమ్మెల్యేగానీ రాలేదని, రైతులకు మేలు చేసే సీఎం రావాలన్నారు. అసలు రైతులకు ఏమి ఇచ్చారో ప్రతిగ్రామంలో బోర్డు పెట్టాలని రైతులకు కట్టాల్సిన పంటల భీమా డబ్బులు కూడా కట్టని ప్రభుత్వం ఇది అంటూ బాబు మండి పడ్డారు.
జగన్ ఎక్కడ కాలుపెడితే అక్కడ మటాష్, ఆయన సీఎం అయిన తర్వాత గుంటూరు జిల్లాలో ఆత్మహత్య లు పెరిగాయని, ఆయన పాలనలో మూడువేలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ విషయం లో మాత్రం రాష్ట్రం మూడో స్థానంలో ఉందని బాబు అన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పు ఉండే రైతులు మన రాష్ట్ర రైతులే. రైతులపై తలసరి అప్పు 2.45 లక్షలు గా ఉందన్నారు.
మన మీద కేసులు పెడితే ఏమవుతుంది. పవన్ కళ్యాన్ పార్టీ వారి పైనా కేసులు పెట్టారు. అందుకే నేను వెళ్లి సంఘీభావం తెలియజేశాను. మాపై కేసులు పెట్టడంపై పెట్టే శ్రద్ద రైతులను ఆదుకోవడంపై పెట్టాలి గత ఏడాది మిర్చికి తామర పురుగువచ్చి పంట పోతే ఒక్కరైనా వచ్చి చూశారా, జగన్ రెడ్డి పాలన వల్ల రైతులు అంతా నాశనం అయ్యారన్నారు.
భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరా పత్తికి 30 వేలు, ప్రతి ఎకరా మిరపకు 50 వేల పరిహారం ఇవ్వాలి. మైక్రో ఇరిగేషన్ ద్వారా 90శాతం సబ్సిడీ ఇచ్చిన ఘనత టిడిపి దే. టిడిపి హయాంలో 60 వేల కోట్లు ఇరి గేషన్ పై ఖర్చు పెడితే, ఇప్పుడు పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. జగన్ ఎక్కడ నుంచి వచ్చాడని, రైతు కుటుంబం నుంచి రాలేదా, అమరావతి రైతులను హేళన చేస్తా రా....కార్లు, బంగారం అని హేళన చేస్తారా అని చంద్రబాబు ఆగ్రహించారు.
పవన్ కళ్యాణ్ విశాఖ పట్నం వెళ్లే హక్కులేదా అని ప్రశ్నించారు. మీ దోపిడీ, కబ్జాలు బయటపడ తాయనే పవన్ను అడ్డుకున్నారా అని బాబు ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి సైకో అనుకుం టే...ఆయన కొత్త సైకోలను తయారు చేస్తున్నారని, అమరావతి కి వెళ్లేటప్పుడు నా కాన్వాయ్ పై దాడి చేస్తే ప్రజాస్వామ్యం అనడం దారుణమన్నారు. పవన్ రాజకీయ పార్టీ వేరే కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం కోసం వెళ్లి తాను మద్ద తు ఇచ్చానన్నారు.రాజకీయ పార్టీలకే దిక్కులేకపోతే, ఇక ప్రజల సంగతి ఏంటని, తప్పుడు ఆరోపణ లకు సిఎం సమాధానం చెప్పాలన్నారు.
టిడిపి కార్యాలయంపై దాడి చేసి ఏడాది దాటినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు లేవు, దీనికి డిజిపి సమాధానం చెప్పగలరా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు, దాడు లకు తాను భయపడనన్నారు. వివేకా హత్య జరిగితే నారా సుర రక్త చరిత్ర అన్నారు. నాడు వివేకా హత్యపై జగన్ సిబిఐ దర్యాప్తు కావాలి అన్నారు...తరువాత సిఎం అయ్యాక సిబిఐ దర్యాప్తు వద్దు అన్నారు. కన్న కూతురుగా తండ్రి హత్యపై పోరాడుతున్న సునీతను అభినందించాలని, సిబిఐ దర్యా ప్తు చేస్తుంటే వారిపైనే కేసులు పెట్టడం ఎక్కడయినా ఉంటుందా అని బాబు ప్రశ్నించారు.


.webp)



