TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..కమలం పార్టీ కన్ను ఆ రాష్ట్రంపైనే..!

Published on: Tue Apr 22, 2025 8:02PM

 

ఏపీ రాజ్య సభ విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయానికి వచ్చింది. ఇవాళ కేంద్రమంత్రి అమిత్‌షాతో  సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు విషయంలో... టీడీపీ పార్టీ అలాగే జనసేన రెండు కాంప్రమైజ్ అయ్యాయి. ఏపీ రాజ్యసభ స్థానం బిజెపికి ఇచ్చేందుకు... టిడిపి అలాగే జనసేన రెండు పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బిజెపికి కేటాయించారు.ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో.. రాజ్యసభ అభ్యర్థి పై చర్చ జరిగింది. అమిత్ షా... నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు ను కిషన్ రెడ్డి కూడా కలిశారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమిళనాడు మాజీ బిజెపి అధ్యక్షుడు అన్నామలైను అభ్యర్థిగా నిలపబోతున్నట్టు అమిత్‌షా, చంద్రబాబు తెలిపినట్లు తెలుస్తోంది. కొత్తగా ఈ రాజ్యసభ రేసులో మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. 

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. అక్కడ పాగా వేయాలని కమలం పార్టీ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తమిళనాడు బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై తన పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే జాతీయ స్థాయిలో అన్నామలైకి మంచి గుర్తింపు ఇస్తామని.. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఏప్రిల్ 15వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్ దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ 29 గా నిర్ణయించారు అధికారులు. ఇక 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు మే రెండవ తేదీ నిర్ణయించారు. మే 9వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. వైసిపి పార్టీ సీట్ల ప్రకారం వాళ్లకు అవకాశం లేదని తెలుస్తోంది. అంటే ఈ రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.