రాజకీయ నిరుద్యోగుల్లో పెరుగుతున్న అసహనం

posted on: Mar 21, 2012 11:11AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రాజకీయ నిరుద్యోగుల్లో అసహనం నానాటికి పెరుగుతోంది. గ్రామ పంచాయితీలు, జిల్లా, మండల పరిషత్ లు, మున్సిపాలిటీలు, నీటి సంఘాలు తదితర పాలక మండళ్ళ పదవీకాలం ముగిసి అనేక నెలలు కావస్తోంది. ఒక్కప్పుడు ఈ పదవులు ఆశించిన చోటా మోటా నాయకులంతా ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా మారారు. మళ్ళీ వీటికి ఎన్నికలు జరిగితే వారికి ఉపాధి లభిస్తుంది. కాని ప్రభుత్వం మాత్రం వీటికి ఎన్నికలు జరిపించకుండా 6 నెలలకొకసారి అధికారుల పాలనను పొడిగిస్తూ వస్తోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి చిన్నా చితకా పదవులు లభిస్తాయి. ఈ పదవులకు తగ్గట్టుగా ఎంతోకొంత ఆదాయం ఉంటుంది. సుమారు రెండేళ్ళుగా ఖాళీగా ఉన్న ఈ రాజకీయ నిరుద్యోగులు స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎమ్మెల్యే, ఎంపిలపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలు జరపాలని నిర్ణయిస్తే ఇప్పటికే ఉన్న రాజకీయ నిరుద్యోగులతోపాటు కొత్తవారు కూడా పోటీకి తహతహలాడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ నుంచి తమకు అవకాశం దక్కుతుంది, స్థానికంగా ఏఏ వర్గాల మద్దతు తీసుకోవాలి, ఎన్నికల ఖర్చు ఎంతవుతుంది, విజయావకాశాలు ఎలా ఉంటాయి అనే అంశాలపై కొత్త అభ్యర్ధులు లెక్కలు వేసుకుంటున్నారు.

 

 

google-ad-img
    Related Sigment News
    • Loading...