అమ్మో.. ఇన్ని కోట్లు.. ఎవరివీ కావు!

posted on: Aug 3, 2024 5:10PM

మన దేశంలోని బ్యాంకుల్లో ఎవరికీ చెందని డబ్బు ఎంత వుందో తెలుసా? అక్షరాలా 78 వేల కోట్లు. బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసినవాళ్ళు ఆ తర్వాత తమ అకౌంట్లను ఆపరేట్ చేయడం మానేయడం లేదా చనిపోవడం.. ఇలాంటి కారణాల వల్ల 2024 నాటికి ఇలా అన్ క్లైమ్‌డ్ అకౌంట్లలో డబ్బు 78 వేల కోట్లకు చేరుకుంది. అలాంటి అకౌంట్లకు నామినీ కూడా ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడిన కారణంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. మమ్మల్ని బయటకి తెచ్చి ఖర్చుపెట్టేయండి మొర్రో అని మొత్తుకుంటున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త ఆలోచన చేస్తోంది. దేశంలో వున్న అన్ని బ్యాంక్ అకౌంట్లకు ఇప్పటి వరకు ఒక నామినీనే సూచించే పద్ధతిలో మార్పులు చేసి, ప్రతి అకౌంట్‌కి నలుగురి వరకు నామినీలను సూచించే విధంగా చేయాలని ఆలోచిస్తోంది. దీనివల్ల నలుగురు నామినీలలో నలుగురు లేదా ఒకరైనా అకౌంట్లను క్లైమ్ చేసుకుంటారని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది బాగానే వుంది... మరి ఇప్పటికే బ్యాంకుల్లో వుండిపోయిన 78 వేల కోట్ల మాటేమిటి? 

google-ad-img
    Related Sigment News
    • Loading...