Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు పదోన్నతి
posted on: May 17, 2022 3:01PM
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జన్ భుయాన్ కు పదోన్నతి లభించింది. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసుల మేరకు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు తెలంగాణ హైకోర్టు సీజేగా ప్రమోషన్ లభించింది. ప్రస్తతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయనున్నారు. కాగా ఉజ్జల్ భుయాన్ గువహటి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2011 అక్టోబర్ 17న నియమితులయ్యారు. 2013 మార్చి 20 కన్ఫర్మ్ అయ్యారు.






