ఉజ్జయిని కుంభమేళాలో విషాదం.. తొక్కిసలాటలో 5గురు మృతి

 

ఉజ్జయిని కుంభమేళాలో పెను విషాదం చోటు చేసుకుంది. గతరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా తొక్కిసలాట జరిగి ఐదుగురు మృతి చెందగా 30 మంది వరకు గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఈ సంఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెంటనే స్పందించారు. ఉజ్జయిని అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

 

కాగా 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా ఏప్రిల్ 22న ప్రారంభమైన నేపథ్యంలో.. ఈ కుంభమేళాకు లక్షల మంది భక్తులు వచ్చారు. నెల రోజులు పాటు జరిగే ఈ కుంభమేళాకు రోజుకూ 3 నుంచి 7 లక్షల వరకు భక్తులు హాజరవుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu