ఉదయభాను బీజేపీలో చేరతారా?

posted on: Jul 22, 2013 4:13PM

 

Will Udaya Bhanu join BJP?, Udaya Bhanu BJP

 

 

ప్రముఖ యాంకర్ ఉదయభాను బిజెపిలో చేరతారా? ఈ విషయమై ఒక టీవీ చానల్ లో విస్తారంగా ప్రచారం జరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తానన్న మాట అవాస్తవమని భాను చెప్పినప్పటికీ.. ఆమె రాజకీయ అరంగేట్రం ఖాయమని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్న భారతీయ జనతా పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఉదయభాను సొంత జిల్లా కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు ఆమెను సిద్ధం చేస్తున్నట్లు చెబుతన్నారు. ఉదయభాను తండ్రి మాజీ సర్పంచ్ కూడా కావడంతో ఆమె రాజకీయాల్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఐతే మరోవైపు ఉదయభాను పాట వల్ల చెలరేగిన వివాదం ఇంకా చల్లారినట్లు లేదు. గద్దె కోసం గాడిద కొడుకులు అని ఆమె పాడిన నేపథ్యంలో కొందరు ఆగంతుకుల నుంచి ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. తనకు రక్షణ కావాలని కూడా ఆమె పోలీసులను కోరిందట.

google-ad-img
    Related Sigment News
    • Loading...