ఢిల్లీ మ‌ద్యం స్కామ్‌.. ఇద్ద‌రు అధికారులు స‌స్పెండ్‌

posted on: Aug 23, 2022 4:51PM

దేశంలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న ఢిల్లీ మ‌ద్యం స్కామ్‌లో కేంద్ర హోం శాఖ ఇద్ద‌రు అధికారుల‌ను స‌స్పెండ్ చేసింది. మాజీ ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ గోపీకృష్ణ‌ను, మాజీ ఎక్సైజ్  డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆనంద్ తివా రీనీ స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇప్పటికే ఈ స్కామ్‌లో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ను ఏ1గా చేర్చింది. 120-బీ, 477-ఏ సెక్షన్ల ప్రకారం ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌‌లో చేర్చారు. సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లు ఈ ఎఫ్‌ఐఆర్‌‌లో ఉన్నాయి. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌‌లో నాటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపి కృష్ణ పేరు, మాజీ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ పేర్లు కూడా ఉన్నాయి. 

ఇదిలా ఉండ‌గా, ఢిల్లీ మ‌ద్యంవిధానంపై దాఖ‌లైన కేసులో భాగంగా సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు నిర్వ‌హించింది. అలాగే ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర‌పాలిత ప్రాంతంతోపాటు మొత్తం 21 చోట్ల ఈ దాడులు జ‌రిగాయి. 

గత ఏడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు, విధా నపర లోపాలు జరిగాయ‌ని ప్ర‌చారం వెల్లువెత్తింది.  టెండర్ల విధానంలో ఆయాచితంగా కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయా లు తీసుకున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన నివేదిక పై దర్యాప్తు చేప ట్టాలని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐకి సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇంఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్ర గురించి కూడా నివేదికలో ఉంది. దీంతో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. 

తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కూడా ఢిల్లీ మద్యం స్కామ్‌తో సంబంధాలున్నాయని కథనాలు వెలువ డుతున్నాయి. ఢిల్లీ మద్యం స్కామ్‌తో సంబంధం ఉందంటూ తనపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సాపై పరువునష్టం దావా వేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే హెచ్చరించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...