Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...11నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు
posted on: Mar 7, 2026 1:40PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 11 నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 11, 12 తేదీలలో కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ తెలిపారు.
ఈ మేరకు అన్ని జిల్లాల కెక్టర్లకు మెమో జారీ చేశారు. రాజధాని అమరావతి సచివాలయంలో నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్సుకు అవసరమైన సమాచారంతో అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరు కావాలని పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సు జరిగే రెండు రోజులూ ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
................................................



.webp)


