Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి షాక్!
posted on: Jun 5, 2021 9:22AM
ఇండియాతో వివాదాన్ని కొనసాగిస్తోంది సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్. భారత్ రూపొందించిన కొత్త ఐటీ రూల్స్ ను అంగీకరించడానికి ముందుకు రావడం లేదు. ఇతర సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు దిగొచ్చినా.. ట్విట్టర్ మాత్రం వాదనకు దిగుతోంది. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు షాకిచ్చింది ట్విట్టర్. వెంకయ్య నాయుడు అకౌంట్ నుంచి అధికారిక బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యూడ్జ్‌ను తొలగించింది.
అయితే ప్రస్తుతం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉండటంతో... ఆయన కార్యాలయం సెక్రటేరియట్ నిర్వహిస్తున్న... VPసెక్రటేరియట్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా) మాత్రం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌తో కొనసాగుతోంది. "ట్విట్టర్... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధికారిక అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌ని తొలగించింది." అని ANI న్యూస్ ఏజెన్సీకి... ఉపరాష్ట్రపతి కార్యాలయం స్వయంగా తెలిపింది.ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్‌కి 13 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఉపరాష్ట్రపతి కార్యాలయ అధికారిక అకౌంట్‌కి 9,31,000 ఫాలోయర్స్ ఉన్నారు. వెంకయ్యనాయుడు అధికారిక అకౌంట్ నుంచి గతేడాది జులై 23న చివరి ట్వీట్ వచ్చింది.
కొత్త ఐటీ రూల్స్‌కి సంబంధించి... గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు కేంద్రంతో డీల్ ఓకే చేసుకోగా... ట్విట్టర్ మాత్రం ఈ సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి అంగీకరించలేదు. కేంద్రంతో వాదనకు దిగుతోంది. ఇలాంటి సమయంలో... ఈ సంచలన పరిణామం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.




