Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పోలీసులకు ఫిర్యాదు చేసిన దిగ్విజయ్ ప్రియురాలు
posted on: May 2, 2014 12:18PM
.jpg)
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రియురాలు దిగ్విజయ్ సింగ్ కంటే తెలివైనదిలా కనిపిస్తోంది. ఎంచక్కా దిగ్విజయ్‌సింగ్‌తో సరస సల్లాపాలు ఆడుతూ, వాటిని ఫొటోలు తీసుకుని కంప్యూటర్లో, ఈ మెయిల్స్ లో పెట్టింది. మరి ఆ ఫొటోలని బయటకి అమృతే లీక్ చేసిందో మరెవరో చేశారోగాని ఫొటోలు బయటపడ్డాయి. దాంతో దిగ్విజయ్ అమృతని పెళ్ళి చేసుకోబోతున్నట్టు ప్రకటించక తప్పలేదు. ఎన్నో సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్న వివాహేతర సంబంధాన్ని పెళ్ళితో చట్టబద్ధం చేసుకోక తప్పలేదు. సరసపు ఫొటోలు తీసుకుంది దిగ్విజయ్, అమృత జంట. వాటిని కంప్యూటర్‌లో పెట్టుకుంది ఆ జంటే. ఇప్పుడు సదరు ఫొటోలు లీకైతే ఆ విషయాన్ని పరిశోధించే బాధ్యత మాత్రం పోలీసుల మీద పడింది. తన కంప్యూటర్ని, ఈమెయిల్ని హ్యాక్ చేసింది ఎవరో పరిశోధించి చెప్పాలని అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికిపోయిన దిగ్విజయ్, అమృత బాగానే వున్నారు. పోలీసులకే కొత్త తలనొప్పి వచ్చి పడింది.



.jpg)


