Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డిగ్గీ, అమృత భలే పోజులిచ్చారు
posted on: May 2, 2014 4:26PM
.jpg)
కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ నెత్తిన గుదిబండలా మారిన దిగ్విజయ్ సింగ్ అమృతారాయ్ అనే టీవీ యాంకర్‌తో గత కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీళ్ళ సంబంధం గురించి తెలిసిన అమృతారాయ్ భర్త ఆమె నుంచి విడాకులు కోరుకున్నాడు. వీళ్ళు ఏకాంతంగా వున్న సమయంలో ముచ్చటపడి తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీక్ కావడం, దాంతో వీళ్ళిద్దరూ పెళ్ళి బాట పట్టడం ఈ పాయింట్లన్నీ రెండు రోజులుగా మీడియాలో నానుతూనే వున్నాయి.
అయితే ఇప్పుడు ఈ అంశాన్ని జనం మరో కొత్త కోణంలో చూస్తు్న్నారు. ఆ కోణం ఏమిటంటే, బయటకు లీక్ అయన ఫొటోల్లో దిగ్విజయ్, అమృత సూపర్‌గా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారని, ఈ ఎక్స్ ప్రెషన్లు ఏ సినిమా హీరో హీరోయిన్లకి అయినా తీసిపోకుండా వున్నాయని. ఎంతో సంతోషంగా వున్న ఫేస్‌తో దిగ్విజయ్ భుజం మీద చేయి వేసిన అమృత.. హాయిగా కళ్ళు మూసుకుని ఏదో తన్మయత్వంలో వున్న దిగ్విజయ్ సింగ్. ఈ ఫొటోలలో వీళ్ళిద్దరి పోజులను చూసి జనం ముచ్చటపడుతున్నారు.
సినిమాల్లో నటించే హీరో హీరోయిన్లు ఎక్స్ ప్రెషన్లు ఎలా ఇవ్వాలో వీళ్ళిద్దరిని చూసి నేర్చు్కోవాలని అంటున్నారు. దీనిమీద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ ట్విట్టర్‌లో కామెంట్ చేశాడు. ఫొటోల్లో వీళ్ళిద్దరి ఎక్స్ ప్రెషన్లు చూస్తుంటే దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా హీరో హీరోయిన్లని చూసినట్టు అనిపించిందని వర్మ కామెంట్ చేశాడు. దిగ్విజయ్, అమృత ఏదైనా సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తే ఎలా వుంటుందంటారు?



.jpg)


