తురకా కిశోర్ అరెస్ట్ నిబంధనలకు విరుద్దం..విడుదల చేయాలి : హైకోర్టు
posted on Aug 7, 2025 3:59PM
.webp)
వైసీపీ నేత తూరకా కిశోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్దంగా తూరకా కిశోర్‌ను అరెస్ట్ చేశారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో మేజిస్ట్రేట్ సంతృప్తి చెందినట్లు రిమాండ్ ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపింది. అరెస్టుతో పాటు రిమాండ్ విధింపు విషయంలో చట్టనిబంధనలు ఉల్లంఘిస్తే నిందితుడిని ఒక్క నిమిషం కూడా జైలులో ఉంచడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది.
ఓ దశలో రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేసేందుకు సిద్ధమైంది. కిశోర్ విడుదలకు ఆదేశాలిస్తామని తెలిపింది. కిశోర్‌ను అరెస్టు చేసే సమయంలో బీఎన్‌ఎస్ఎస్ సెక్షన్-47 (అరెస్టు గురించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం), సెక్షన్-48 (అరెస్టుకు గల కారణాల) కింద ఇచ్చిన నోటీసులు నిరాకరించి ఉంటే మధ్యవర్తి సమక్షంలో ఆ విషయాన్ని నమోదు చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది.