ఎగ్జిబిషన్ మీద దాడి.. 21 మంది మృతి
Published on: Thu Mar 19, 2015 11:50AM

టునీసియా దేశంలోని టునిస్ నగరంలో జరుగుతున్న ఒక ఎగ్జబిషన్ మీద తీవ్రవాదులు జరిపిన దాడిలో 21 మంది మరణించారు. ఈ విషయాన్ని టునీసియా ప్రధానమంత్రి ప్రకటించారు. మరణించిన వారిలో 13 మంది విదేశీ పర్యటకులు వున్నారు. వీరిలో పోలెండ్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ దేశాలకు చెందిన వారు వున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు దుండగులను పోలీసులు కాల్చి చంపేశారు. మరో ముగ్గురు పరారయ్యారు. ఇటీవలి కాలంలో అనేక దేశాలలో ఉగ్రవాద దాడులు తరచూ జరుగుతున్నాయి. మొన్నీమధ్య ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలలో జరిగిన ఉగ్రవాద దాడులు ప్రపంచం ఉలిక్కిపడేలా చేశాయి. ఉగ్రవాదుల ప్రభావం తక్కువగా వుండే ఈ దేశాలలో కూడా ఉగ్రవాద దాడులు జరగడం ఆశ్చర్యాన్ని కలిగించింది.


