TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తుని ఘటన.. ప్రభుత్వం వదిలినా మేం వదలం..!

Published on: Wed Feb 10, 2016 12:22PM

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జన పేరిట ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అది కాస్త ఉద్రిక్తంగా మారి ఆందోళన కారులు రెచ్చిపోయి వాహనాలు, రైలుకు నిప్పంటించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఈ విషయంపై రైల్వేశాఖ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నెల 31న జరిగిన తుని ఘటనలో ఆందోళన కారులు రత్నాచల్ ఎక్స్రప్రెస్ కు నిప్పంటించి.. అందులో ఉన్న ప్రయాణికులను భయభ్రాంతులను చేశారు. దీంతో విశాఖ నుండి విజయవాడ మధ్య ఉన్న ప్రాంతాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించటంతో పాటు రైల్వేశాఖకు కూడా అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే రత్నాచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పుపెట్టి తీవ్ర నష్టం కలిగించిన అంశాన్ని రైల్వేశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఈఘటనకు సంబంధించి ఆధారాలను సేకరించడంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి కొంత మంది ఫొటోలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. అంతేకాదు నిప్పంటిన వారే కాదు.. ఆందోళన ఉద్రిక్తత చేయడానికి ప్రయత్నించిన వారిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రైల్వే దర్యాప్తు బృందాలు చాలా లోతుగా దర్యాప్తును సాగిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ ఆధారాలను సేకరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ప్రభుత్వ చూసీ చూడనట్టు వదిలేస్తుందేమో కానీ మేము మాత్రం వదిలేది లేదు రైల్వేశాఖ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి సంఘటనలను తేలికగా వదిలేస్తే భవిష్యత్తులో మళ్లీ పునరావృతమవుతాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి మన ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందో లేదో తెలియదు కానీ రైల్వే అధికారులు మాత్రం వదిలేరాలేరు..