TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణకు పట్టిన శని కేసీఆర్

Published on: Sat Oct 25, 2014 6:18PM

 

తెలంగాణకు పట్టిన శనిలా కేసీఆర్ తయారయ్యారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అతి తెలివితేటలు, కక్షసాధింపు ధోరణి వల్లే రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు వచ్చాయని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ వైఖరి ఇప్పటికైనా మారకుంటే నలభై ఏళ్ళయినా ప్రాజెక్టులు పూర్తికావని రేవంత్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముందుగా మేలుకొని 900 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు 54 శాతం విద్యుత్ ఎలా వచ్చిందో కేసీఆర్ తెలుసుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. కేసీఆర్ అందంగా అబద్ధాలు చెప్పాలని మీడియా ముందుకు వచ్చి చెప్పలేకపోయారని రేవంత్ వ్యంగ్యంగా అన్నారు. వాస్తవాలను వక్రీకరించి, తెలంగాణ ప్రజలను, రైతులను రెచ్చగొట్టేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.