Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...2020-21 కి గాను 3,309 కోట్ల బడ్జెట్ కు టిటిడి పాలకమండలి ఆమోదం!
posted on: Feb 29, 2020 4:02PM

టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన టిటిడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు టిటిడి పాలకమండలి ఆమోదం తెలిపింది. గత ఏడాది కంటే 66 కోట్ల మేర టిటిడి బడ్జెట్ పెరిగింది.
టిటిడి పాలకమండలి కీలక నిర్ణయాలు:
- భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు 3.30 కోట్లు కేటాయింపు....
- తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మాణానికి ఆమోదం.....
- 34 కోట్లు ఎస్.వి బధిరపాఠశాల హాస్టల్ నిర్మాణానికి నిర్ణయం..
- బర్డ్ ఆసుపత్రిలో అభివృద్ది పనులకు 8.5 కోట్లు కేటాయింపు....
- చెన్నైలో పద్మావతి ఆలయం నిర్మాణానికి 3.9 కోట్లు కేటాయింపు....
- హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని టిటిడి టెంపుల్ దగ్గర పుష్కరిణి, కళ్యాణమంటపం, వాహనమంటపం నిర్మాణానికి ఆమోదం...
- షోషియల్ మీడియాలో టిటిడి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టేటందుకు ఇన్ఫోసిస్ సహకారంతో సైబర్ క్రైమ్ విబాగం ఏర్పాటుకు నిర్ణయం....
- అలిపిరి దగ్గర వాహనాల ఎంట్రీ టోల్ ఫీ పెంపుదలకు నిర్ణయం, టూవిలర్ కు టోల్ ఫీ మినహాయింపు...కార్లు,జీపులు లకు 50రూపాయలు, బస్సు, లారీలు 100 రూపాయలు, హెవీ వాహనాలకు 200 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించిన టిటిడి.
Latest YouTube Trending Video NEWS






