Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వకులామాత ఆలయంలో అక్షరాభ్యాసాలు!
posted on: Mar 13, 2026 9:57AM

తిరుమల తిరుపతి దేవస్థానం మరో ఆధ్యాత్మిక సేవను అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణలోని బాసర, వర్గల్ తీరులోనే తిరుపతి సమీపంలోని వకులమాత ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకునేందుకు అక్షర గోవిందం అనే కార్యక్రమాన్ని ప్రారంచనుంది. ఈ కార్యక్రమం ద్వారా మూడు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి తల్లి అయిన వకులమాత ఆశీస్సులతో పిల్లల విద్య ప్రారంభం కావాలని భావిస్తూ ఈ కార్యక్రమానికి టీటీడీ రూపకల్పన చేసింది.
వకులమాత ఆలయం కొండపై ఉండటంతో భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయం చెరువు సమీపంలో ప్రత్యేకంగా ఒక మండపాన్ని నిర్మించనుంది. ఆ మండపంలో అక్షరాభ్యాసం నిర్వహిస్తారు. కాగా ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న పిల్లలకు టీటీడీ అక్షర గోవిందం కిట్ అందజేస్తుంది. ఈ కిట్ లో పలక, బలపాల బాక్సు, అక్షింతలు, కుంకుమ, శ్రీ వేంకటేశ్వరస్వామి – సరస్వతి దేవి – గణపతి చిత్రాలు, కంకణం, పటిక బెల్లం ప్రసాదం ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించేందుకు టిటిడి సిద్ధమైంది. అందు కోసం దాదాపు 300 కిట్లను సిద్ధం చేసింది.


.webp)
.webp)


