ఆర్టీసీ కార్మికుల కేసును రేపటికి వాయిదా వేసిన హైకోర్ట్...

 

తెలంగాణలో ఎటు చూసిన ఆర్టీసీ సమ్మె పై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి.ఈ సమ్మె పై అనేక విచారణలు కూడా చేపడుతున్నారు నేతలు.అటు ప్రభుత్వ మొండి వైఖరి ఒక రకంగా ఉంటే ఇటు ఆర్టీసీ నేతల చర్యలు కూడా అలానే తగ్గేది లేదు అన్నట్లు తయారవుతోంది.ఇందు మూలంగా ఆర్టీసీ నేతలు ఇప్పటికి తమ నెల జీతాలను అందుకోలేదు. ఈ చర్యల కారణంగానే ఆర్టీసీ కార్మీకులు కోర్టులో కేసు వేశారు.ఆర్టీసీ కార్మికుల జీతాలకు సంబంధించిన విచారణ రేపటికి వాయిదా పడింది. ఒక వైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె ఒక వైపు కొనసాగుతుంది. మరొకవైపు కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొంత ఆందోళన కలిగిస్తుంది. సెప్టెంబరు నెల మొత్తం జీతం ఇప్పటికి వారికి రాకపోవడం పట్ల ఆందోళనకు లోనవుతున్నారు ఆర్టీసీ కార్మికులు. 

నెల రోజులు పని చేసిన తర్వాత కూడా జీతం రాకపోవడం సంబంధించి కార్మికులు హైకోర్టును ఈ రోజు ఆశ్రయించడం జరిగింది. ఇవాళ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఒక పిటీషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న పిటీషన్ వేసారు ఆర్టీసీ కార్మికులు. ముఖ్యంగా ఆర్టీసిలో సెప్టెంబర్ నెలలో పని చేసిన డబ్బులను అక్టోబర్ ఫస్ట్ కు చెల్లించాల్సిన జీతము ఇప్పటి వరకు కూడా చెల్లించనందు వలన ఈ రోజు కేసు వేయడం జరిగింది. ఈ రోజు జడ్జి గారి దగ్గరికి వాదనకు వెళ్లగా జడ్జి గారు ఈ కేసును రేపటికి వాయిదా వేశారు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారమే చేసిన పనికి వెంటనే జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీతాలు ఆపటం అనేది చట్ట విరుద్ధం కాబట్టి ఈ విధానంపై హైకోర్టులో ఈ రోజు కేసు వేయగా జడ్జ్ ఈ కేసును రేపటికి వాయిదా వేశారు.జీతాల విషయంలో తమకు న్యాయం జరిగేలా చేయ్యాలని ఆందోళనను చేపడుతున్నారు కార్మికులు.