కపిలేశ్వర ఆలయంలోకి తృప్తీ.. అడ్డగించిన ట్రస్ట్ సభ్యులు

posted on: May 26, 2016 2:40PM

 

లింగ వివక్షతకు వ్యతిరేకంగా భూమాతా బ్రిగేడ్ సంస్థ అధ్యక్షురాలు తృప్తీ దేశాయ్ పలు ఆలయాల్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శనిసింగనాపూర్ లోని శనిదేవుని ఆలయంలోకి.. త్రయంబకేశ్వరాలయంలోకి ప్రవేశించిన తృప్తీ.. ఇప్పుడు నాసిక్ లోని కపిలేశ్వర ఆలయంలోకి కూడా ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈరోజు తృప్తి దేశాయ్ కపిలేశ్వర ఆలయంలోని గర్భగుడిలోకి  ప్రవేశించడానికి ప్రయత్నించగా.. ట్రస్ట్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఆలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...