Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణా ద్రోహులను కూడా ఆదరించిన ఓటర్లు
posted on: Mar 22, 2012 12:23PM
తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, స్టేషన్ ఘన్ పూర్, అదిలాబాద్, కామారెడ్డి ఉప ఎన్నికల్లో తెలంగాణా వాదమే గెలిచిందనేది నిర్వివాదాంశం. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్, బిజెపిలు తమ సమీప ప్రధానపార్టీలయిన కాంగ్రెస్, టిడిపిలను తెలంగాణా ద్రోహులుగా అభివర్ణిస్తూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశాయి. తెలంగాణా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్, టిడిపిల నాయకులు ఎన్నికల ప్రచారానికి వస్తే వారిని తరిమికొట్టాలని టిఆర్ఎస్ నాయకులు పదే పదే ఓటర్లకు పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపును తెలంగాణా ఓటర్లు ఖాతరు చేయకపోవడం విశేషం, ఆరు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ ఐదు స్థానాల్లోనూ, బిజెపి ఒక స్థానంలో గెలిచింది, ఇక్కడి ఓటర్లు ఆ రెండు పార్టీల అభ్యర్థులను గెలిపించినప్పటికీ తెలంగాణా ద్రోహులుగా ముద్రపడ్డ కాంగ్రెస్, టిడిపిల అభ్యర్థులను కూడా బాగానే ఆదరించడం విశేషం.
మహబూబ్ నగర్ లో బిజెపి అభ్యర్థి శ్రీనివాసరెడ్డి 39, 272 ఓట్లు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులకు 44.814 ఓట్లు రావడం విశేషం. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధనరెడ్డికి 71 వేల ఓట్లు రాగా కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులకు 62,284 ఓట్లు వచ్చాయి. కొల్లాపూర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధి జూపూడి కృష్ణారావుకు 58,107 ఓట్లు రాగా, కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులకు 78,370 ఓట్లు వచ్చాయి. స్టేషన్ ఘన్ పూర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధి రాజయ్యకు 81,279 ఓట్లు రాగా కాంగ్రెస్, టిడిపి అభ్యర్ధులకు 77,606 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ లో టిఆర్ఎస్ అభ్యర్థి జె. రాజన్నకు 59,452 ఓట్లు రాగా కాంగ్రెస్, టిడిపి అభ్యర్ధులకు 49,305 ఓట్లు వచ్చాయి. కామారెడ్డిలో టిఆర్ఎస్ అభ్యర్ధి గంప గోవర్ధన్ కు 75, 699 ఓట్లు రాగా కాంగ్రెస్, టిడిపి అభ్యర్ధులకు 50 వేల ఓట్లు పోలయ్యాయి. ఈ పరిమాణాలు పరిశీలిస్తే తెలంగాణా ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ ఉన్నప్పటికీ ఆ సెంటిమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీల అభ్యర్ధులను కూడా ఓటర్లు గణనీయంగానే ఆదరించినట్లు తెలుస్తోంది. ఈ పరిమాణం టిఆర్ఎస్ కు మింగుడు పడటం లేదు.



.jpg)


