మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిన టీఆర్ఎస్
posted on Dec 3, 2015 10:14AM
.jpg)
తెలంగాణ సీఎం కేసీఆర్ తో టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలను మంత్రి హరీశ్ రావే స్వయంగా కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మరోసారి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుండి చాలామంది నేతలు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా మంత్రులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు గీతారెడ్డి, ముఖేష్ గౌడ్ లను టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్. అయితే గీతారెడ్డి, ముఖేష్ గౌడ్లను ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావాలని.. ఆ భాధ్యతను కేశవరావుకు, డిఎస్ లకు అప్పగించారట కేసీఆర్. మరోవైపు టీడీపీ పై కూడా టీఆర్ఎస్ దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యే సాయన్నతో భేటీ అయినట్టు కనిపిస్తోంది. మరి వారు అనుకున్నట్టు జరిగితే టీఆర్ఎస్ పార్టీకి ఇంకా బలం చేకూరినట్టే.