టీఆర్ఎస్ అవిశ్వాసానికి స్పీకర్ అనుమతి

posted on: Mar 15, 2013 10:57AM

 

 

TRS No Confidence motion,TRS YSR Congress no confidence notices

 

 

కాంగ్రెస్ ప్రభుత్వం పై టీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనుమతించారు. తీర్మానానికి అనుకూలంగా ఉన్న సభ్యుల సంఖ్యను స్పీకర్ లెక్కించారు. 45మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. సంఖ్యాబలం ఉండటంతో అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతి ఇచ్చారు. టిడిపి సభ్యుడు హరీశ్వర్ రెడ్డి విప్ దిక్కరించి నోటీసుకు మద్దతు ప్రకటించారు.

 

కాంగ్రెస్‌పార్టీ శాసన సభా పక్షం పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని సీఎల్పీ జారీ చేసిన విప్‌లో ఆదేశించింది. అవిశ్వాసంపై ఇవాళ రేపు చర్చ జరిగి ఏ క్షణమైనా ఓటింగ్ జరిగే అవకాశం ఉన్నందున తమ సభ్యులంతా సభలో అందుబాటులో ఉండాలని సీఎల్పీ జారీచేసిన విప్ లో పేర్కొంది.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...