మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

posted on: Jul 20, 2020 11:09AM

తెలంగాణలో ఇప్పటికే అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు క‌రోనా బారిన‌ప‌డగా.. తాజాగా టీఆర్ఎస్ కి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలింది. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యేతో పాటు.. ఆయన భార్య, కుమారుడు విధాత్‌ లకు సైతం పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబం డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...