TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్ఎస్ కార్యకర్తల గొడవ

Published on: Fri Mar 27, 2015 12:17PM

 

అసలే ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీ ప్రసాద్ ఓడిపోయిన బాధలో వున్న తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కి ఇప్పుడు కార్యకర్తల్లోని అనైక్యత కూడా ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల మధ్య వివాదం చెలరేగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్ర, శనివారాల్లో ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలో ఏర్పాటు విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. మా ఫ్లెక్సీలే వుండాలి మా ఫ్లెక్సీలే వుండాలంటూ తీవ్రంగా గొడవపడ్డారు. గొడవపడిన వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.