Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉద్యమ నేతలకా.. బీటీ బ్యాచ్ లీడర్లకా! కేసీఆర్ ఎమ్మెల్సీ జాబితాలో ఉండేదెవరో?
posted on: Oct 31, 2021 7:46PM
ఐదు నెలలుగా పెండింగులో ఉన్న శాసనమండలి ఖాళీల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడంతో తెలంగాణలో మరో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ సీట్లు భర్తీ కానుండటంతో అశావాహులంతా యాక్టివ్ అయ్యారు. అసెంబ్లీలో ఉన్న బలం ఆధారంగా ఆరు సీట్లు అధికార టీఆర్ఎస్ కు దక్కనుండటంతో ... సీఎం కేసీఆర్ ప్రసన్నం కోసం గులాబీ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ సీట్ల కోసం పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో కేసీఆర్ ఎవరిని ఖరారు చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆకుల లలిత, ఫరీజుద్దీన్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడికుంట్ల వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసింది. వీళ్లలో శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోసారి అవకాశం ఖాయమంటున్నారు. ఆయనకు బెర్త్ ఖాయమైనట్లు కేసీఆర్ నుంచి సిగ్నల్ వచ్చిందంటున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరినప్పుడే హామీ ఇచ్చినందున ఆకుల లలితకు మళ్లీ అవకాశం ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. మిగితా నాలుగు స్థానాల కోసం పలువురు పోటీ పడుతున్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా టికెట్ కోసం పోటీ పడిన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఆయన రేసులో ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ పోస్టు ఆశిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నేతి విద్యాసాగర్, కోటిరెడ్డి నల్గొండ జిల్లాకు చెందిన వారే. దీంతో నల్గొండ జిల్లా నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి అవకాశం ఉండదంటున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన ఎల్ రమణ, పెద్దిరెడ్డి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. వీళ్లలో ఒకరిని కేసీఆర్ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఉమ్మడి వరంగల్జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఈసారి అవకాశం వస్తుందా.. లేదా అనేదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. దళిత సామాజికవర్గం నుంచి కడియం శ్రీహరికి చాన్స్ ఉంటుందని పార్టీ నేతల్లో కొంత ప్రచారం ఉన్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఇవ్వరని కూడా చెప్పుకుంటున్నారు. కడియం కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుకు అవకాశం దక్కవచ్చని అంటున్నారు. హుజురాబాద్రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య టీఆర్‌ఎస్‌లో చేరిన కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కేబినెట్ తీర్మానం చేసి పంపినట్లు అధికారికంగానే ప్రకటించారు. కానీ ఇది పెండింగ్‌లో పడింది. దీంతో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో పంపి.. గవర్నర్ కోటాలో మరొకరిని సిఫారస్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు,
బొడికుంట్ల వెంకటేశ్వర్లకు కూడా రెన్యూవల్ ఉండవచ్చనే టాక్ వస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత తక్కెళ్లపళ్లి రవీందర్ రావు, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్, తాడూరి శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ స్పీకర్ మధుసూదనచారీ కూడా ఎమ్మెల్సీ కోసం కేసీఆర్ దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ మైండ్ లో ఎవరదున్నది మాత్రం తేలడం లేదు. ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చేనెల 9న నోటిఫికేషన్ జారీ కానుంది. అదేనెల 16 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా.. 17న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణలకు అవకాశం. నవంబర్ 29న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉండగా.. అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ఉండనుంది.






