Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లగడపాటిపై టీఆర్ఎస్ ఫిర్యాదు
posted on: Dec 1, 2018 1:18PM

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ పార్టీ లగడపాటి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు కూడా చేసింది. ఎన్నికలను ప్రభావితం చేసేలా ఈ ప్రకటన ఉన్నదని, సర్వే వివరాలు ప్రకటించటం ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఎన్నికల సమన్వయ కమిటీ తరఫున దండె విఠల్ ఫిర్యాదుచేశారు. తిరుపతిలో లగడపాటి చేసిన ప్రకటనను టీవీల్లో ప్రసారం చేశారని.. ఇలాంటి ప్రకటన ఈ సమయంలో సరైంది కాదని పేర్కొన్నారు. రోజుకు ఇద్దరు ఇండిపెండెంట్లకు సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తానని లగడపాటి పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. కాగా తెలంగాణ ఎన్నికల్లో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవబోతున్నారని... నారాయణ్‌పేట్, భోథ్‌లో స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి టీఆర్ఎస్ ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తో ?...ఫిర్యాదు నేపథ్యంలో రోజుకు రెండు పేర్లు ప్రకటిస్తా అని చెప్పిన రాజగోపాల్ ..ఈరోజు మరో రెండు పేర్లు చెప్తారా లేదా? అని సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.






