Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉద్యోగులు చేయగలిగినంత చేశారు: కేసీఆర్
posted on: Oct 26, 2011 10:09AM
హైదరాబాద్: 'ఉద్యోగులు
చేయగలిగినంత చేశారు. అంతకన్నా చేయగలిగింది లేదు. ఇక అందుకోవాల్సింది రాజకీయ పార్టీలే' అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు.సమ్మె నుంచి ఉద్యోగులు సేఫ్‌గానే లాండ్ అయ్యారన్నారు.42 రోజులపాటు చేసిన సమ్మెను వాయిదా వేసుకున్న నేపథ్యంలో కేసీఆర్‌తో తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అగ్రనేతలు కె.స్వామిగౌడ్, జి.దేవీప్రసాదరావు, వి.శ్రీనివాస్ గౌడ్, సి.విఠల్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు.ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను జేఏసీ నాయకులు ఆయనకు చూపించారు.'ఉద్యోగుల త్యాగాన్ని మరువలేం. ఉద్యోగులు ఎంత చేయాలో అంత చేశారు. ఇక రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రావాలి' అని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యోగులు చేసిన ఉద్యమాన్ని ఇక పార్టీలు అందుకోవాలని, అప్పుడే తెలంగాణపై స్పష్టత వస్తుందని, లేకుంటే విషయం తేలదని అన్నారు. ఉద్యోగుల ఉద్యమంపై తెలంగాణలో ఎక్కడా వ్యతిరేకత రాలేదన్న అభిప్రాయం భేటీలో వ్యక్తమైంది


.jpeg)



