Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తల తిరగం తగ్గాలంటే.. ఆయుర్వేద ఔషధం..
posted on: Mar 10, 2021 4:51PM
తల తిరగడం లేదా ఒళ్ళు తిరగడం సమస్యకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉందని అంటున్నారు ఒజెస్ ఆసుపత్రికి చెందిన ఆయుర్వేద వైద్యులు
డాక్టర్ టి వేణుగోపాల్. తల తిరగడం అంటే భ్రమ అని వాత పిత్త దోషం వల్ల భ్రమ వస్తుందని ఆయన అన్నారు. ఈ లక్షణాలలో భాగంగా ఒళ్ళు తిరగడం గిడ్డినేస్స్ కు కారణాలుగా పేర్కొన్నారు. బిపి, షుగర్ లెవెల్స్ ఎక్కువయినప్పుడు తల తిరగడం లేదా ఒళ్ళు తిరగడం వంటి లక్షణాలు గమనించవచ్చని తెలిపారు. సర్వైకల్ స్పొండోలసిస్, డిస్క్ బల్జ్, డిస్క్ డీజనరేషన్, వల్ల సర్వైకల్ నర్వ్ ఒత్తిడికి గురై బిగుసుకు పోతాయని వేణుగోపాల్ వివరించారు. దీనికి కారణం రక్త ప్రసారం చేసే నరాలు కుంచించుకుపోయి గిడ్డి నెస్ వస్తుందని అన్నారు గిడ్డినేస్ వల్ల ఎక్కువసేపు పడుకోవాలని అనిపిస్తుంది, చీకట్లు కమ్ము కుంటాయి. అంత కళ్ళముందు చీకట్లు కమ్ముకుని ఉన్నట్లు అనిపిస్తుంది. గిడ్డి నెస్ వల్ల నిద్ర సరిగ్గా లేక పోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం నడుస్తూనే గిడ్డినెస్ తో కింద పడిపోవడం గమనించవచ్చని వేణుగోపాల్ అన్నారు. ఒక్కోసారి పడుకున్న తగ్గదు. ఆయుర్వేదం లో ఈ సమస్య పరిష్కారం కోసం కృష్ణాది చూర్ణం అంటే నాలుగు మూలికలు వేసి తాయారు చేసిన గుళికలు చేసుకుని 9 వారాలులు తీసుకుంటే గిడ్డి నెస్ పోయి ఆరోగ్యంగా ఉంటారు. అందుకు పెద్దగా ఖర్చు కూడా ఏమి లేదు. పిప్పలి -- అంటే పిప్పళ్ళు, సత పుష్ప బద్దసోంపు, కరక్కాయ -హరీతగి తీసుకోవాలి. ఇప్పడు ఈ మందును ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కరక్కాయల్ని నీళ్ళలో వేస్తే పాడై పోయిన కరక్కాయలు అడుగుకి చేరి పోతాయి ఆ తరువాత కరక్కాయ పెచ్చును తీసుకోవాలి. శొంఠి అంటే బాగా ఎండ బెట్టిన అల్లం, సమ పాళ్ళలో తీసుకోవాలి. పిప్పళ్ళను మూకుట్లో వేయించాలి. కొంచం తెల్లగా వచ్చిన వెంటనే పొడి చేయాలి. ఆ తరువాత శొంఠి బాగా దంచ్చుకోవాలి. శత పుష్ప ను లైట్ గా వేయించుకోవాలి. శొంఠి, కరక్కాయ, పిప్పళ్ళు, విడివిడిగా పోడి చేసుకోవాలి.యాభై గ్రాముల పిప్పళ్ల పొడి , యాభై గ్రాముల సత పుష్ప, యాభై గ్రాముల యాభై గ్రాముల కరక్కాయ పొడి యాభై గ్రాముల శొంఠి పొడియాభై గ్రాముల బద్ధ సోంపు పొడి ఇలా సమ పాళ్ళలో కలుపుకొని అనీ కలిపి 400 గ్రాములు తయారు చేసిన మిశ్రమాన్ని,400 గ్రాముల బెల్లం కలిపి బాగా కలలిపి గుండ్రని మాత్రలు తయారు చేసుకోవాలి. ప్రతి రోజూ మొహం కడుక్కోగానే మాతర వేసుకుని ఆవు పాలు తాగాలి. అలా తొమ్మిది వరాలు తీసుకుంటే గిడ్డినేస్స్ పోయి హాయిగా ఆరోగ్యంగా ఉంటారు.






