తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

posted on: Feb 26, 2026 9:40AM

 

తెలంగాణ పరిపాలన వ్యవస్థలో విస్తృత స్థాయిలో మార్పులు చోటుచేసుకు న్నాయి. మొత్తం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిన్న రాత్రి ఆలస్యంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కార్యదర్శి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ బదిలీలు జరగడం పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతం చేయడం, శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

కీలక శాఖల్లో మార్పులు

పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న సంజయ్ కుమార్‌ను పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు బదిలీ చేశారు. ఐటీ & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్‌ను నియమించారు. ఫ్లాగ్‌షిప్ సంక్షేమ–అభివృద్ధి పథకాల అమలుకు సంబంధించిన యూనిట్‌తో పాటు సిఎస్‌ఆర్ బాధ్యతలను సబ్యసాచి ఘోష్‌కు అప్పగించారు. 

లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖలో కొనసాగుతున్న ఎం. దానకిశోర్‌కు విపత్తు నిర్వహణ శాఖ అదనపు బాధ్యతలు ఇచ్చారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాను బదిలీ చేసి, బీసీ సంక్షేమ శాఖను అదనంగా అప్పగించారు. ఇరిగేషన్ & సిఏడీ శాఖ కార్యదర్శిగా ఈ. శ్రీధర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫైనాన్స్ & ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్ నియమితులయ్యారు.

సంస్థలు – కార్పొరేషన్లలో కొత్త నియామకాలు

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా మహబూబ్‌న గర్ కలెక్టర్ బి. విజయేంద్రను నియమించారు. సహకార శాఖ స్పెషల్ కమిషనర్ & రిజిస్ట్రార్‌గా రాహుల్ రాజ్ పీఎస్ బాధ్యతలు చేపట్టను న్నారు. ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా ఎం. హనుమం తరావు బదిలీ అయ్యారు. ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా సిక్తా పట్నాయక్ నియమితులయ్యారు. కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా పామెలా సత్యపతి బాధ్యతలు చేపట్టనున్నారు.

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శివేంద్ర ప్రతాప్ నియమితుల య్యారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా జితేష్ వి. పాటిల్‌ను నియమించారు. విద్యుత్ పంపిణీ సంస్థల్లో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

జిల్లాల పరిపాలనలో విస్తృత మార్పులు

జిల్లా కలెక్టర్ల స్థాయిలో కూడా భారీగా మార్పులు జరిగాయి. కరీంనగర్ కలెక్టర్‌గా చిత్రా మిశ్రా, రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా గరీమా అగర్వాల్, వికారాబాద్ కలెక్టర్‌గా దీపక్ తివారి, మెదక్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా అంకిత్, హనుమకొండ కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయి, మహబూబ్‌ నగర్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా నియమితులయ్యారు. మహబూబాబాద్, నారాయణపేట్, యాదాద్రి భువనగిరి, జనగాం, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు కొత్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది.

జీహెచ్ఎంసీ – ఇతర విభాగాల్లో పోస్టింగ్‌లు

జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లుగా పలువురిని నియమించారు. మెడ్చల్–మల్కాజిగిరి, వికారంాబాద్ జిల్లాలకు అదనపు కలెక్టర్లను పోస్టింగ్ చేశారు. ప్రజావాణి, ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్ సెల్ వంటి విభాగాలకు కూడా అదనపు నోడల్ అధికారులను నియమించారు.

రాష్ట్ర సర్వీస్ అధికారులకు బాధ్యతలు

రాష్ట్ర సర్వీస్‌కు చెందిన పలువురు అధికారులను వివిధ జిల్లాల్లో అదనపు కలెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్‌కర్నూల్, మంచిర్యాల, వరంగల్, సిద్ధిపేట, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఈ నియామకాలు జరిగాయి. 

పరిపాలనకు కొత్త దిశ ఈ బదిలీలతో జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడంతో పాటు సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కీలక శాఖల్లో అనుభవజ్ఞులైన అధికారులను నియమించడం ద్వారా పాలనలో ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పరిపాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే ఈ మార్పులు రాబోయే రోజుల్లో రాష్ట్ర పాలనపై ప్రభావం చూపనున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...