తెలంగాణ సడక్ బంద్ వాయిదా

posted on: Feb 22, 2013 3:11PM

 

TPJAC calls off Sadak Bandh agitation, Sadak Bandh to hit air passengers too, Sadak Bandh postponed,  Sadak Bandh postpone

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న తలపెట్టిన “సడక్ బంద్” కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. ఈ నెల 24న హైదరాబాద్ – బెంగుళూరు హైవేను దిగ్బంధించాలని కార్యాచరణ రూపొందించారు. అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు దాదాపు 12 చోట్ల సడక్ బంద్ పాయింట్లను జేఏసీ నిర్ణయించింది. దీనికి సన్నాహకంగా ఇప్పటికే జేఏసీ రెండు రోజులు బస్సు యాత్ర నిర్వహించింది.

 

ఇక దీనికితోడుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుకూడా ఒక రోజు బస్సుయాత్ర నిర్వహించారు. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలోని టీఆర్ఎస్, జేఏసీ నేతలను పోలీసులు బైండోవర్ కింద అరెస్టు చేశారు. అనూహ్యంగా హైదరాబాద్ లో బాంబు పేలుడు ఘటన జరగడంతో దానిని వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తరువాత వెల్లడిస్తామని తెలిపారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...