Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పీఆర్సీ ఝలక్.. కోవర్టులకు చెక్.. ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్.. పంజాబ్ లో రచ్చ.. టాప్ న్యూస్@7PM
posted on: Jan 6, 2022 6:00PM
ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు ఉద్యోగ సంఘాలు చెప్పిన అన్ని అంశాలను నోట్ చేసుకున్నట్లు చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదని.. ఉద్యోగ సంఘాలు సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని.. మంచి చేయాలనే తపనతోనే ఉన్నట్లు సీఎం వివరించారు
-------
కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని హెచ్చరించారు. తన కార్యకర్తపై దెబ్బ పడిందంటే అది తనమీద పడినట్టేనని అన్నారు తాను ఎవరినీ వదలి పెట్టానని హెచ్చరించారు.తాను కుప్పంను సరిచేస్తాను కానీ వదలి పెట్టానని చంద్రబాబు హెచ్చరించారు.పార్టీని ప్రక్షాళన చేస్తానని చెప్పారు. పార్టీలో కోవర్ట్‌లు ఉంటే తప్పుకోవాలని.. లేదంటే తానే ఏరివేస్తానని స్ఫష్టం చేశారు.
-----
అమరావతి కోర్ కేపిటల్ ఏరియా 29 గ్రామాల్ని19 గ్రామాలకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అన్యాయమని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 29 గ్రామాలు కాకుండా 19 గ్రామాల కార్పొరేషన్లను ఏర్పాటు చేయటం కోర్టు ఉల్లంఘన అవుతుందన్నారు. శ్మశానం, ఎడారి, గ్రాఫిక్స్ అని విమర్శించిన రాజధానిని ఏ విధంగా తాకట్టుపెడతారని సోమిరెడ్డి ప్రశ్నించారు.
------
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య అందరినీ షాక్ కు గురి చేసిందని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. వివేకా కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి పులివెందుల ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు.ఈ హత్య కేసులో వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిలు నార్కో అనాలసిస్ పరీక్షలకు ఒప్పుకోవాలని... లేని పక్షంలో హత్యతో వారికి సంబంధం ఉన్నట్టు అనుమానించాల్సి ఉంటుందని అన్నారు.
---
ఏపీ రాజకీయాల్లో కాక రాజేస్తున్న జిన్నా టవర్‌ను గుంటూరు నగర మేయర్ నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. మున్సిపల్ అధికారాలతో కలసి టవర్‌ను పరిశీలించారు. జిన్నా టవర్ చుట్టూ కంచె వేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు మూడు రోజుల్లో కంచె వేసి టవర్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటామని మేయర్ కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు.
--------
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుంది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవేందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కుమారుడు విచారణకు సహకరించేలా చూసే బాధ్యత తనదంటూ ఎమ్మెల్యే వనమా బహిరంగ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు రాఘవేందర్ ను ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పోలీసులకు అప్పగించారు.
-------
తెలంగాణలో రజాకార్ల పాలన సాగుతోందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ వల్ల ఒక కుటుంబం మొత్తం చనిపోయారని అన్నారు. రాఘవను గతంలోనే అరెస్ట్ చేసి ఉంటే ఇంత దారుణం సంభవించి ఉండేది కాదని అన్నారు. కేసీఆర్ నయా రజాకార్ మాదిరి తయారయ్యారని మండిపడ్డారు.
----
తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ బాధితులే ఉంటారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు చెప్పారు. అయితే అందరికీ జీనోమ్ సీక్వెన్స్ చేయడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. ఇప్పటికే ఒమిక్రాన్ సమూహ వ్యాప్తి మొదలైందని అన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే యోచన లేదని, పేదల బతుకుదెరువు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
--------
దేశంలో కరోనా కేసులు మళ్లీ అమాంతం పెరుగుతున్నాయి. దీంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా బెంబేలెత్తిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమయిందని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది. పరిస్థితి రోజురోజుకూ విషమిస్తున్న తరుణంలో మరో కలకలం రేగింది. ఇటలీ నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ కు ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన 179 మందిలో 125 మందికి కరోనా నిర్ధారణ అయింది.
---------
ప్రధానమంత్రికి రక్షణ కల్పించలేకపోవడం సిగ్గుచేటని బీజేపీకి గట్టి మద్దతుదారు అయిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అన్నారు. పంజాబ్ ప్రభుత్వం ప్రధానమంత్రికి కనీస రక్షణ కల్పించలేకపోయిందని మండిపడ్డారు. ప్రధాన మంత్రికి భద్రత కల్పించలేకపోవడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని కంగనా అన్నారు.
-------






