Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్యాకేజీ ఏది జగన్.. ఎమ్మెల్యే కొడుకు కీచక పర్వం.. బీజేపీ హ్యాండ్సప్.. మిథాలీ టైమ్.. టాప్ న్యూస్@1PM
posted on: Jan 6, 2022 11:54AM
సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలన్నారు. అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలన్నారు. సీఎం గతంలో ప్రకటించిన 10 లక్షల ప్యాకేజీ అందించాలని నారా లోకేష్ కోరారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు.
-------
ఫిట్‌మెంట్‌తో పాటు అన్ని డిమాండ్‌లను సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావిస్తామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.తెలంగాణ, తమిళనాడులో ఎక్కువ ఫిట్ మెంట్ ఇచ్చారని, 27 శాతం ఐఆర్ ఇస్తున్నారన్నారు. ఏపీలో అంతకంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఉండాలని కోరతామన్నారు. 27 శాతం కన్నా తక్కువ ఫిట్ మెంట్ ఇవ్వడం వారికి మర్యాద కాదన్నారు. 27 శాతం కంటే తక్కువ ఇస్తే ఉద్యోగుల జీతాలు తగ్గుతాయన్నారు.
------
రాష్ట్రానికి బీజీపీ ఒక శనిగ్రహమని.. టీడీపీ, వైసీపీలు రాహుకేతువులని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలిపారు. బీజేపి ఒక మోసకారి పార్టీ అని.. టీడీపీ అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. వైసీపీ అరచేతిలో కైలాసం చూపిస్తోందన్నారు. దుష్ఠత్రయ పార్టీలైన బీజేపీ, టీడీపీ, వైసీపీలను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమి కొడితేనే రాష్ట్రం బాగుపడుతుందని తులసిరెడ్డి పేర్కొన్నారు.
--------
కడప జిల్లా జమ్మలమడుగులో ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుంది. సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ దేవగుడి కుటుంబ సోదరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. బీజేపీనేత మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత నారాయణరెడ్డి.. ఇరుపార్టీ నేతల ప్లెక్సీలను చించివేశారు. అయితే సీపీ ఫుటేజీతో ఎవరు చించారనేది బయటపడింది. దీంతో గొడవలు జరగకుండా ముందస్తుగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
-----
సిమెంటు, ఇసుక రేట్లు తగ్గించి భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్ సర్కార్‌కు సినిమా టికెట్ల రేట్లు తగ్గించడంలో ఉన్న శ్రద్ధ సిమెంటు, ఇసుక ధరలు తగ్గించడంలో లేదెందుకని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత రెండున్నర ఏళ్ళ కాలంలో భవన నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. అల్ట్రాటెక్, భారతి సిమెంట్ రేట్లు అధికంగా ఉన్నాయన్నారు
-------
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ కీచక పర్వానికి ఓ కుటుంబం బలైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో వ్యక్తం చేసిన ఆవేదన చూస్తే సభ్యసమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉందన్నారు. తక్షణం రాఘవను అరెస్టు చేయాలని, ఎమ్మెల్యే గా వనమాతో రాజీనామా చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
-------
భారీగా డ్రగ్స్‌ను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున్న ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ ముఠా డ్రగ్స్‌ను ఎక్కడికి సరఫరా చేసిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
--
పంజాబ్ లో నిన్న ప్రధాని మోదీ కాన్వాయ్ ని అడ్డుకున్న ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ పై ఆగిపోయింది. ఈ ఘటనకు తామే కారణమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించుకుంది. ప్రధానికి నిరసనను తెలిపేందుకు పియారియానా గ్రామ సమీపంలోని ఫ్లైఓవర్ వద్దకు వచ్చామని తెలిపింది.
---
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా 'అఖండ' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 14న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇంతకు ముందు ప్రకటించింది. అయితే కొంత ఆలస్యంగా స్ట్రీమింగ్ 21 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు ఇప్పుడు తెలిపింది.
---
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 పోటీలకు వెటరన్ క్రికెటర్ మిథాలీ రాజ్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ వైస్ కెప్టెనుగా ఉండగా, మిథాలీ రాజ్ భారత్‌కు నాయకత్వం వహించనుంది.ఆల్ ఇండియా ఉమెన్స్ సీనియర్ సెలక్షన్ కమిటీ న్యూజిలాండ్ టూర్,షో పీస్ ఈవెంట్ కోసం జట్లను ఎంపిక చేసిందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
-------


.webp)
.webp)


