Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీకి గ్రహణం.. అమరావతిలో రచ్చ.. గుండు జాగ్రత్త.. మోడీకి షాక్.. టాప్ న్యూస్@7PM
posted on: Jan 5, 2022 6:15PM
రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టిందని, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని వైసీపీ ధ్వంసం చేసిందని టీడీసీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు.బాధితుల తరఫున తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్థానికంగా వైసీపీ నేతలు పాల్పడుతోన్న మోసాలను ఎండగట్టాలని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు
------
వైఎస్ జగనుకు ఓటేసి ప్రజలు తప్పు చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ చరిత్ర తెలిసి మరీ ప్రజలు ఓటేశారన్నారు. టీడీపీని లేకుండా చేసేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలే చేసిందన్నారు. వైసీపీ తరహాలో టీడీపీ గాలికి పుట్టి.. గాలికి పెరగలేదన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గు లేదా..? అని ప్రశ్నించారు.
------
సిటీ మున్సిపల్ కార్పొరేషన్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో తొలిరోజున అధికారులకు రాజధాని రైతులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదనను కురగల్లు గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. దీనిని కురగల్లు గ్రామస్తులు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
-----
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు హౌసింగ్ లేఅవుట్‌లో గృహ నిర్మాణ లబ్ధిదారులతో మంత్రి రంగనాథరాజు ముఖాముఖి నిర్వహించారు. లే అవుట్‌లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. గృహ నిర్మాణాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఫైర్ అయ్యారు. పనులు చేయించకుంటే సెలవు పెట్టి వెళ్లిపోవచ్చన్నారు.
-------
3 వారాల వరకు నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలు జరపొద్దని హైకోర్టు ఆదేశించింది. నరసరావుపేట మున్సిపాలిటీలో విలీనమయ్యే గ్రామాల్లో ఓటర్లు మళ్లీ పురపాలకసంఘంలో ఓటుహక్కు వినియోగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాగే వార్డుల రిజర్వేషన్ హేతుబద్ధంగా జరగలేదని పిటిషనర్ పేర్కొన్నారు. రాజకీయ పక్షాలకు ఓటర్ల జాబితా కూడా ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు.
-------
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండున్నరేళ్లలో జగన్ సాధించింది అప్పు మాత్రమేనని ఆరోపించారు. ఆ అప్పు కోసమే సీఎం ఢిల్లీ వచ్చినట్లు కనిపిస్తోందన్నారు.రాష్ట్ర హక్కులను కూడా సాధించలేని అసమర్థ నాయకత్వం ఇంకెన్నాళ్లని... ఏపీ ప్రజలను ఇంకెంతకాలం మభ్యపెడతారని ఆయన ప్రశ్నించారు
-----
హైకోర్టులో బండి సంజయ్‌కి ఊరట లభించింది. సంజయ్‌ను విడుదల చేయాలని హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జ్యూడీషియల్ రిమాండ్ పై హైకోర్టు స్టే విధించింది. వ్యక్తిగత పూచి 40 వేల బాండ్ పై విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదని హైకోర్టు పేర్కొ్ంది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 7కు హైకోర్టు వాయిదా వేసింది.
-------
బీజేపీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేందుకు నడ్డాకు సిగ్గుందా అని కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్ పట్ల జేపీ నడ్డా వ్యాఖ్యలు హేయంగా ఉన్నాయన్నారు. బండి సంజయ్‌కి, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన అని కువిమర్శలు చేస్తున్నారన్నారు.
----
భద్రతా లోపం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయినట్టు హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ''ప్రధాని కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ దగ్గరకు చేరుకునేటప్పటికి కొందరు నిరసనకారులు రోడ్డును దిగ్బంధించినట్టు గుర్తించారు. ప్రధాని ఫ్లైఓవర్‌పైనే 15 నుంచి 20 నిమిషాలు చిక్కుకుపోయారు. ప్రధాని భద్రతకు సంబంధించిన ఇది కీలకమైన లోపం''అని హోం మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.
---
భద్రతా కారణాల రీత్యా ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దు కావడం, తిరిగి బటింటా విమానాశ్రయానికి ఆయన చేరుకోవడం వంటి ఘటనలు బుధవారం పంజాబ్‌లో చోటుచేసుకున్నారు. ''ప్రాణాలతో బటిండా విమానాశ్రయానికి చేరుకున్నా. మీ ముఖ్యమంత్రికి థాంక్స్'' అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అధికారులతో అన్నట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్ చేసింది.
---------



.webp)


