అమరావతిలో అలజడి.. వైసీపీ నేతలకు తడిసిపోతాయట.. మంత్రి రాసలీలలు.. టాప్ న్యూస్@1PM

posted on: Jan 5, 2022 11:52AM

ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ గురువారం భేటీ కానున్నారు. పీఆర్సీపై తుది ప్రకటన చేసే అవకాశం ఉంది. సీఎస్, ఆర్థిక శాఖాధికారులతో సీఎం జగన్ బుధవారం  సమావేశం కానున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగ సంఘాలతో భేటీ అయింది సీఎస్ కమిటి. ప్రతి సారీ ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందేమోనని ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ప్రతి సారీ నిరాశే ఎదురైంది.
----
అమరావతి ప్రాంతంలో మరో అలజడికి ప్రభుత్వం తెర లేపింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు సన్నద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజధాని రైతులు తప్పుబడుతున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని అభిప్రాయపడుతున్నారు.
--
గుంటూరులో జిన్నా టవర్‌తో పాటు విశాఖ కేజీహెచ్ పేరు కూడా మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇకపై జగనన్న కాలనీలను మోదీ కాలనీలుగా మారుస్తామని.. ఎవరొస్తారో చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకుని ప్రచారం చేసుకుంటోందన్నారు. మా బొమ్మలు వేస్తే వైసీపీ వారికి అన్ని తడిసిపోతాయని సోము వీర్రాజు పేర్కొన్నారు.
---------
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం ఉదయం బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ఇంటికి చేరుకున్న గవర్నర్ హరిబాబుకు కన్నా లక్ష్మీ నారాయణ, శనక్కాయల అరుణ, రావెల కిషోర్ బాబు, పాటిబండ్ల రామకృష్ణ స్వాగతం పలికారు.  పలువురు బీజేపీ నేతలు గవర్నర్ హరిబాబును కలిసి అభినందనలు తెలిపారు. 
----
కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైసీపీలో మరోసారి విబేధాలు బయటపడ్డాయి.   నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో రగడ చోటు చేసుకుంది. మంత్రి పర్యటన కోసం నందికొట్కూరులో వేసిన  ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటో వేయడం మరిచారు. దీంతో ఫ్లెక్సీలలో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటో కనబడకపోవడంతో ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు
---------
బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణు నియోజకవర్గంలో రేషన్ బియ్యం బండిలో వైసీపీ నేతలు సంక్రాంతి మామూళ్లు వసూలు చేస్తున్నారు. జనవరి కోటా బియ్యాన్ని ఇంటింటికి పంపిణీ చేస్తూ అదే వాహనంలో పండగ మామూళ్లు పేరుతో డబ్బా ఏర్పాటు చేసి ..కార్డుదారుల దగ్గర పండగ మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. వెళ్ల గ్రామంలో బియ్యం పంపిణీ చేసే వాహనం డ్రైవరు.. సిబ్బంది మామూళ్లు వసూలు చేస్తున్నారు.
----
మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్‌పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సలహాలు ఇస్తే తనను దళిత ద్రోహిగా చిత్రీకరిస్తున్నారన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ రాసలీలలు త్వరలో బయట పెడతానని తెలిపారు. రామగుండంలో ఇసుక, బూడిద, మాఫియాలో ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ఆరోపించారు.
---
బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ లీడర్లు.. గల్లీ లీడర్లు రాసిన స్క్రిప్ట్‌ చదువుతున్నారని అన్నారు. జేపీ నడ్డా సీఎం కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని... లేకుంటే బెంగాల్‌లో మాదిరిగా ఉరికించి కొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిల్లర మాటలు మాట్లాడితే.. ఉన్న మూడు సీట్లు కూడా పోతాయన్నారు. బండి సంజయ్‌, అరవింద్‌పై పీడీ యాక్ట్‌ పెట్టాలని డిమాండ్ చేశారు
---
దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొన్న‌ 37,379 క‌రోనా కేసులు న‌మోదు కాగా, నిన్న ఏకంగా 58,097 కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. నిన్న క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 15,389కు చేరింది. క‌రోనాతో నిన్న‌ 534 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక డైలీ పాజిటివిటీ రేటు 4.18 శాతానికి చేరింది.
---
పశ్చిమ బెంగాల్ బీజేపీలో లుకలుకలు తారస్థాయికి చేరాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రాన్ని సందర్శించనున్న వేళ కేంద్ర సహాయమంత్రి శంతను ఠాకూర్ పార్టీకి చెందిన వివిధ వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ వాట్సాప్ గ్రూపుల నుంచి క్విట్ అయినట్టు స్వయంగా శంతను ఠాకూర్ ప్రకటించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...