Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఔటర్ రింగ్‌రోడ్డు లీజు.. అనుమానాలకు తావిస్తున్న నిర్ణయం
posted on: May 9, 2023 10:27AM
ఔటర్ రింగ్‌రోడ్డు అవినీతిపై అధికార బిఆర్‌ఎస్ నోరుమెదపడం లేదు. ఏదైనా ఆరోపణలు రాగానే అంతెత్తు ఎగిరిపడే నేతలు అసలు ఈ విషయంపై నోరెత్తడం లేదు. మున్సిపల్ శౄఖ మంత్రికెటిఆర్ కూడా మౌనం వహిస్తున్నారు. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు లీజు వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.
ఆ తరువాత బీజేపీ నేతలు దానిని అందుకున్నారు. అవినీతి జరిగివుంటే.. లేదా నిబంధనలకు విరుద్దంగా లీజ్ ఇచ్చివుంటే కేంద్రంలోని బీజేపీ చర్యలు తీసుకోవాలి. నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ, ఈడీ దర్యాప్తలకు ఆదేశించాలి. కానీ బీజేపీ మాత్రం వాటి జోలికి వెళ్లకుండా ఆరోపణలకే పరిమితం అవుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రభుత్వం లీజుకు ఇచ్చే విషయంలో విపరీతమైన వివాదాలు నెలకొంటున్న వేళ నిజాలు నిగ్గు తేలాలి. విపక్షాల ఆరోపణలకు కేవలం మున్సినల్ అడ్మినిస్టేషన్ కమిషనర్ అర్వింద్ కుమార్ ముక్తసరి ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. నిజానికి ఓఆర్‌ఆర్ ను 30 ఏళ్ల పాటు పైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న దానికి అధికారపక్షం నుంచి సమాధానం రావడం లేదు. ఓఆర్‌ఆర్ లీజు తమ అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకొని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్నారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
హెచ్‌ఎండీఏ కు ఓఆర్‌ఆర్ పై టోల్స్ వసూలు చేయడం ద్వారా రాబోయే 30 ఏళ్లలో రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందని అన్నారు. లీజు ఏ కంపెనీకి టెండరు రావాలో ముందే సీఎం కేసీఆర్ నిర్ణయించారని ఆరోపించారు. పైవేటీకరణకు తాము వ్యతిరేకమంటున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ను ఎందుకు పైవేటు సంస్థకు లీజుకు ఇచ్చిందని నిలదీస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం లీజు పక్రియ జరగడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు పరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉందని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఓఆర్‌ఆర్‌ను 30ఏళ్ళ వరకు లీజ్‌కు ఇవ్వాల్సిన అవసరం ఏంటన్న దానికి మంత్రి కెటిఆర్ నుంచి సమాధానం రావడంలేదు. ఏప్రిల్ నెల సగటు టోల్ గేట్స్ నుండి వచ్చిన ఆదాయం రోజుకు కోటి ఎనభై ఐదు లక్షలు దాటింది. ఏడాదికి సుమారుగా 720 కోట్లు ఆదాయం వస్తోంది. ముఫ్లై ఏళ్లపాటు లీజుకు ఇవ్వడమంటే సుమారుగా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కానీ పిసిసిచీప్ 30వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.
మరి అంతలా ఆదాయం వస్తున్న ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్స్ లీజును అప్పనంగా ఓ కంపెనీకి కేవలం 7380 కోట్లకు 30 ఏళ్లపాటు ఎలా కేటాయిస్తారంటూ ఇటీవల ప్రశ్నించారు. వెంటనే ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టోల్ గేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రభుత్వమే టోల్ గేట్ లను నిర్వహిస్తూ బ్యాంకుల నుండి నిధులు తెచ్చి బ్యాంక్ కు వడ్డీ చెల్లించినా మంచి లాభాలు వస్తాయని, అలాండిది ప్రజల సొమ్మును ఐఆర్‌బి అనే సంస్థకు అప్పగించడం వెనుక ఉన్న గూడుపుఠాణి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అందులోనూ డిఫాల్టర్ గా ఉన్న ఐఆర్‌బి కంపెనీకి తిరిగి నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ నిర్వహణ ఒప్పందం పక్రియ వెంటనే ఆపకపోతే కోర్టుకు వెళతామని హెచ్చరించారు. ఈ వ్యహారంపై సిబిఐ, ఈడిల కు ఫిర్యాదు చేయడంతోపాటు ఈ టోల్ గేట్ కుంభకోణంపై పోరాటం చేయనున్నట్లు బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ఔటర్ వ్యవహిరంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఇదేనా కేసీఆర్ చెప్పే గుణాత్మకమైన మార్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీజుతో కల్వకుంట్ల కుటుంబం కొత్త నాటకానికి తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మించి గొంతు కోయడంలో కేసీఆర్ కుటుంబం ఆరి తేరిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.


.webp)



