చరిత్రలో ఇవాళ..
Published on: Sat Jul 16, 2022 2:09PM
అమెరికా ఫ్లోరిడాలోని జాన్ ఎఫ్.కెనెడీ స్పేస్ సెంటర్‌లో 1969 జులై 16న నాసా అపోలో-11 చంద్రుడి మీదికి పంపింది. అలా చంద్రయానం చేసి చంద్రునిపై నిలిచిన తొలి వ్యోమగాములుగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ సుప్రసిద్దు లయ్యారు. అపోలో 11 జులై 24న భూమికి తిరిగి చేరుకుంది. అప్పటివరకూ ప్రపంచ మంతా టీవీల్లో ఆ దృశ్యాలు సంభ్రమాశ్చర్యాలలో చూసింది.
.webp)
అమెరికా 1945లో ఇదే రోజున తొలి ఆటం బాంబు ప్రయోగాత్మకంగా ఉపయోగించింది. న్యూ మెక్సికో ఆల్మనోగార్డో సమీపంలో ఈ ప్రయోగం చేసింది. ఆగస్టులో జపాన్ హిరోషిమా, నాగసాకీలపై ఆటంబాంబు వేయడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. దాని తాలూకు తీవ్ర ప్రభావం అనేక శతాబ్దాలు ప్రజలు అనుభవించాల్సి వచ్చింది.
..


