టీఎంసీ నేతలకు మరో ఎదురుదెబ్బ....
Published on: Fri Apr 28, 2017 5:15PM

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే నారదా కుంభకోణం కేసులో టీఎంసీ నేతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 12 మంది నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వారం రోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. వీరిలో రాజ్యసభ ఎంపీ ముకుల్‌రాయ్, లోక్‌సభ ఎంపీలు సుల్తాన్ అహ్మద్, సౌగత్ రాయ్ తదితరులు ఉన్నారు.


