Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీజేపీ మహిళపై నోరు జారిన టీఎంసీ నేత... క్షమాపణ చెప్పిన నేత..
posted on: Apr 22, 2016 12:52PM

ఈ మధ్య రాజకీయ నాయకులకు నోరు జారడం ఆ తరువాత కళ్లు తెరిచి సారీ చెప్పడం సాధారణమైపోయింది. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రజాక్ మూలా బీజేపీ అభ్యర్థి, మాజీ నటి రూపాగంగూలీని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారసభలో సభలో పాల్గొన్నరజాక్‌మొల్లా మాట్లాడుతూ.. ఆమె రోజు ఎంత పొడవైన సిగరెట్లు తాగుతారో నాకు తెలుసు.. ఆమె నిజంగానే ద్రౌపది అని రూపాగంగూలీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. స్త్రీలను గౌరవించే దేశంలో, ఒక స్త్రీ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా, అధికార పార్టీ చీఫ్ గా ఉన్న రాష్ట్రంలో అదే పార్టీకి చెందిన వ్యక్తి మరొక స్త్రీని ఉద్దేశించి అవమానపూరిత వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుపట్టారు. దీంతో ఆయన తను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ తప్పుగా మాట్లాడినందున క్షమించాలని కోరారు.






