Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుపతి తొక్కిసలాట.. ఎస్పీ సుబ్యారాయుడిపై బదిలీ వేటు.. డిఎస్పీ, గోశాల డైరెక్టర్ సస్పెన్షన్
posted on: Jan 9, 2025 5:14PM

తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి చంద్రబాబు నలుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. తిరుపతి ఎస్పీపై, జాయింట్ కమిషనర్ పై బదలీ వేటు వేశారు. ఇక డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలనును సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రకటించారు.
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద బుధవారం (జనవరి 8) రాత్రి తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించిన సంఘటనకు కారణం డీఎస్పీ రమణకుమార్ నిర్లక్ష్యమే కారణమని అధికారులు ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తిరుపతి వెళ్లి అధికారులతో సమీక్షించి, క్షతగాత్రులను పరామర్శించిన సందర్భంగా తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులపై వివరాలను తెలుసుకున్న చంద్రబాబు తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణబాబు, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. అలాగే తిరుపతి జాయింట్ కమిషనర్ గౌతమిపై కూడా బదలీ వేటు వేశారు.


.webp)
.webp)


